HomeNewsపేరును మార్చగలరు కానీ ప్రజా తీర్పును మార్చలేరు..!

పేరును మార్చగలరు కానీ ప్రజా తీర్పును మార్చలేరు..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఇచ్చిన మాట తూచ తప్పకుండా అమలు చేసే వ్యక్తి మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 
  •  మీ నాయకుడిని మీ మాటలతో ఓడగొట్టేందుకు కంకణం కట్టుకున్నట్టున్నారు
  •  సాయి పూర్ నర్సింలు   ఓడిపోయిన ఫ్రస్టేషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు…
  •  కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సందీప్ రెడ్డి..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ నేత సాయిపూర్ నర్సిములు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సందీప్ రెడ్డి నర్సిములు తీరును ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో “సాయిపూర్ అంటే నేనే.. నేనంటేనే సాయిపూర్” అన్నట్లుగా అహంకారంతో వ్యవహరించిన నర్సిములు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం రోహిత్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన తీరు ఉందంటూ విమర్శించారు.​23వ వార్డు వాల్మీకి నగర్‌లో మీరు చేసిన అవినీతి, అరాచకాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని సందీప్ డిమాండ్ చేశారు. సొంత వార్డులోనే ప్రజల ఆదరణ కోల్పోయి, పార్టీకి ఓట్లు వేయించలేని వ్యక్తి, ఇప్పుడు 36 వార్డుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, ఆయన స్థాయిని విమర్శించే అర్హత నర్సిములుకు లేదని స్పష్టం చేశారు. ఓటమి ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని, మరోసారి ఎమ్మెల్యే గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ తప్పుగా మాట్లాడితే తాండూరు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments