HomeNewsహనుమాన్ దీక్ష ప్రారంభం...!

హనుమాన్ దీక్ష ప్రారంభం…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • రేపటి నుంచే హనుమాన్ మండల దీక్షలు
  • ఆసక్తి గల యువకులు సంప్రదించాలి: దీక్షా సమితి సభ్యులు అనిల్ కుమార్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ప్రాంతంలోని హనుమాన్ భక్తులకు దీక్షా సమితి సభ్యులు కీలక ప్రకటన చేశారు. రేపటి (శనివారం) నుంచి హనుమాన్ మండల దీక్షలు ప్రారంభం కానున్నట్లు సమితి సభ్యులు అనిల్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతునిపై అచంచలమైన నమ్మకంతో 41 రోజుల పాటు కఠిన నియమాలను పాటిస్తూ దీక్షను కొనసాగించాలని కోరారు. క్రమశిక్షణతో కూడిన ఈ మండల దీక్ష చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరడమే కాకుండా, ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే ఆసక్తి గల యువకులు ఈ దీక్షను స్వీకరించాలని పిలుపునిచ్చారు. దీక్షకు సంబంధించిన ఇతర వివరాలు కోసం 95818 18003 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments