HomeNewsఎగ్జిట్ పోల్స్‌లో 'హస్తం' హవా..!

ఎగ్జిట్ పోల్స్‌లో ‘హస్తం’ హవా..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ హవా!
  •  ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం
  •  20కి పైగా వార్డుల్లో గెలుపు దిశగా హస్తం పార్టీ
  •  బీఆర్ఎస్ పట్టుకున్నా.. ఆధిక్యం కాంగ్రెస్‌దే!

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన తాండూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఓటర్ల నాడిని విశ్లేషిస్తే పట్టణంలో కాంగ్రెస్ గాలి బలంగా వీచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం 36 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజా అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 20 వార్డుల్లో విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా 9వ వార్డు నుండి 16వ వార్డు వరకు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. 19, 20, 21 వార్డులతో పాటు 26 నుండి 29 వరకు ఉన్న వార్డుల్లోనూ కాంగ్రెస్‌కు తిరుగులేదని విశ్లేషణలు చెబుతున్నాయి.మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తన పట్టున్న వార్డులను కాపాడుకునే ప్రయత్నం చేసింది. 3, 6, 7, 8 వార్డులతో పాటు చివరి వరుసలో ఉన్న 33, 34, 35, 36 వార్డుల్లో గులాబీ జెండా రెపరెపలాడనుంది. అయితే 18వ వార్డులో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ‘నెక్ టు నెక్’ (50-50) పోరు సాగుతుండటంతో అక్కడ గెలుపు ఎవరిదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఈ ఎన్నికల్లో మరో విశేషం ఏమిటంటే.. మొదటి వార్డులో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉండటం. ఇక బీజేపీ వార్డు 2 మరియు 23లలో, ఎంఐఎం పార్టీ వార్డు 17 మరియు 22లలో తమ ప్రాబల్యాన్ని చాటుకున్నాయి.కాంగ్రెస్: 20+ వార్డులుబీఆర్ఎస్: 10+ వార్డులు బీజేపీ: 02 వార్డులు ఎంఐఎం: 02 వార్డులుజనసేన: 01 వార్డుమొత్తానికి తాండూరు మున్సిపాలిటీలో పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ సునాయాసంగా దాటేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments