Home News సుమిత్ గౌడ్ ను గెలిపించండి….!

సుమిత్ గౌడ్ ను గెలిపించండి….!

125
0
  • సుమిత్ గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి..! 
  • కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు
  • ​ 29వ వార్డు కాలనీ వాసుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు వెంకటేశ్వర కాలనీలో ఆదివారం సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాలనీ వాసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్న సుమిత్ గౌడ్ ను ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా కష్టపడి పనిచేసే నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు హామీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని రోహిత్ రెడ్డి హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజాక్షేత్రంలో వైఫల్యం చెందిన కాంగ్రెస్ నాయకులకు ఈ ఎన్నికల ద్వారా సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వారికే మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here