HomeNewsఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కేసు నమోదు..! 

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై కేసు నమోదు..! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకున్న తాండూరు పోలీసులు
  • జాబితాలో ధారాసింగ్,  కరణం పురుషోత్తం రావు,  రవి గౌడ్, హబీబ్ లాలా
  •  మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారనే ఆరోపణలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, కారణం పురుషోత్తం రావు,   రవి గౌడ్, హబీబ్ లాలా మరికొంతమందిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, కౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ ని విచారించిన కోర్టు, ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.ఈ ఘటనపై బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలనే కుట్రతోనే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడ్డారని విమర్శించారు. కౌంటింగ్ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించి చొరబడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, చట్టం ముందు ఎవరూ అతితీతులు కారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు నమోదుతోనైనా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మరి తాండూరు పోలీసులు ఈ కేసు ను ఈ విధంగా విచారణ చెప్పడతారో చూడాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments