Home News కారు పార్టీ లోకి ఎంఐఎం నేత..!

కారు పార్టీ లోకి ఎంఐఎం నేత..!

578
0
  • బీఆర్ఎస్‌లో చేరిన అమిరుద్దీన్
  • కారెక్కిన ఎంఐఎం నేత
  • 36వ వార్డులో బీఆర్ఎస్ జోరు!

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడు పార్టీ మారారు. పట్టణంలోని 36వ వార్డుకు చెందిన నాయకుడు అమిరుద్దీన్ సోమవారం ఎంఐఎంను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక నేతలు అనిల్ బాండ్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, తాండూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు అమిరుద్దీన్ వెల్లడించారు. 36వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.వార్డు స్థాయిలో పట్టున్న నాయకుడు పార్టీలో చేరడంతో 36వ వార్డులో బీఆర్ఎస్ మరింత బలోపేతం కానుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. అమిరుద్దీన్ వెంట పలువురు ముఖ్య అనుచరులు కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here