గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్
గుజరాత్ లోని జామ్ నగర్ లో 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ను రిలయన్స్ నిర్మించడం ప్రారంభించిందని అంబానీ తెలిపారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో గ్రీన్ జాబ్స్ లభిస్తాయని, గ్రీన్ ప్రొడక్ట్స్, మెటీరియల్ ఉత్పత్తికి వీలవుతుందని, తద్వారా రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, 2024 ద్వితీయార్థంలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధంగా ఉందని అంబానీ వివరించారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధనాల ద్వారా సగం ఇంధన అవసరాలను తీర్చాలన్న గుజరాత్ లక్ష్యానికి తాము సహకరిస్తామని చెప్పారు.