- కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి
- 9వ వార్డులో ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన మున్సిపల్ పరిధిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం తాండూరు మున్సిపాలిటీలోని 09వ వార్డు సాయిపూర్ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఓట్లు అభ్యర్థించారు.వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ చైతన్య ప్రశాంత్ ను ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.






