HomeNewsఓటర్లకు 'బుయ్యని భరోసా...!

ఓటర్లకు ‘బుయ్యని భరోసా…!

  • కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ‘బోయని’ ప్రచారం
  • ​26వ వార్డులో ఇంటింటికీ తిరిగిన ఆర్.బి.ఎల్.ఓ అధినేత శ్రీనివాసరెడ్డి
  • ​సమస్యల పరిష్కారానికి హామీ.. వైశాలి రాజుగౌడ్ కు మద్దతుగా జోరుగా ఓట్ల వేట

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణం లో ఎన్నికల హడావిడి నెలకొంది. ఇందులో భాగంగా ఆదివారం పట్టణంలోని 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వైశాలి రాజుగౌడ్ తరపున ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఆర్.బి.ఎల్.ఓ అధినేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి హాజరై వార్డులో విస్తృతంగా పర్యటించారు.​వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ, ప్రజలను కలుసుకుని ‘చేయి’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీరు, అంతర్గత రహదారుల సమస్యలను శ్రీనివాసరెడ్డి అడిగి తెలుసుకున్నారు.గత కొంతకాలంగా 26వ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. సమర్థవంతమైన నాయకత్వం కోసం వైశాలి రాజుగౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆమె గెలిచిన వెంటనే వార్డులోని సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి, ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments