HomeTelanaganahyderabadఆ సారుకు ఇదేం కొత్త కాదంట...?

ఆ సారుకు ఇదేం కొత్త కాదంట…?

  • గతంలో కూడా ఇలాంటి పనులే చేసాడంట
  • కూతురి వయసులో ఉన్న విద్యార్థినిలతో రిలేషన్
  • ఫోన్ కాల్స్,వీడియో కాల్స్ లలో ముచ్చట్లు
  • వైరల్ అవుతున్న ఆ అధ్యాపకుడి లీలాలు

జనవహిని ప్రతినిధి తాండూరు;. తాండూరు లో ప్రస్తుతం ఆ అధ్యాపకుడి పేరు వ్యవహారం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఎక్కడ చూసిన అందరి నోటా అదే మాట వినిపిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ మైనర్ విద్యార్థినిని ఓ అధ్యాపకుడు మాయమాటలతో లోబర్చుకున్నాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇదే విషయం పై తాండూరు ప్రాంతమంతా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఆ అధ్యాపకుడి లీలలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఆ అధ్యాపకుడికి ఇదేం కొత్త కాదట… కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలను ఇదే మాదిరిగా లోబరుచుకునే ప్రయత్నాలు చేశాడంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కళాశాలలో ఉన్న విద్యార్థినిలతో మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి ఫోన్ నెంబర్ లు తీసుకోని పదే పదే ఫోన్ చేసేవాడని ఆరోపణలు వస్తున్నాయి. అదే కళాశాలకు చెందిన మరో బాలిక తో కూడా ఇదే తరహాలో చాటింగ్ చేసాడని తెలుస్తుంది. కూతురి వయసులో ఉన్న విద్యానిలతో అసభ్య ప్రవర్తన చూపిస్తున్న అధ్యాపకుడికి ఓ రాజకీయ నాయకుడి అండ కూడా ఉందని సమాచారం… గురువు స్థానం లో ఉండి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టిన ఆ అధ్యాపకుడిపై కేసు పెట్టకుండా డబ్బులతో సెటిల్మెంట్ చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. తాజాగా బైటికి వచ్చిన వ్యవహారం కూడా డబ్బులతోనే సెటిల్ చేసారనే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం పై తాండూరు లో జోరుగా చర్చలు జరగడమే కాకుండా ఆ అధ్యాపకుడిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని పాలు సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంకా ఎటువైపుకు దారి తీస్తుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments