HomeEntertainmentToxic Twitter Review: 'టాక్సిక్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో హైలెట్స్ ఇవే..!

Toxic Twitter Review: ‘టాక్సిక్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమాలో హైలెట్స్ ఇవే..!

రాకింగ్ స్టార్ యష్ అనగానే మనకు కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలే గుర్తుకొస్తాయి. ఈ రెండు చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు యష్. ఆ తర్వాత నాలుగేళ్లకు ఇప్పుడు టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాక్సిక్ మేనియా నడుస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26 న విడుదల కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ ప్రభంజనం స్టార్ట్ అయింది. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ- రిలీజ్ ఈవెంట్ భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇక బుక్ మై షో లో ఈ మూవీకి గంటకు 60 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ హైప్ అంటే రిలీజ్ తర్వాత గంటకు లక్ష టికెట్స్ అమ్ముడైనా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.

#ToxicTheMovie INSIDE REPORTS 💥
#Yash‘s Electrifying Screen Presence🔥
• Heavy Problematic Scenes Existed🔞
• Last Act Could’ve been better 😢
• Don’t Expect #KGFChapter2 Kind Of Stuffs
• Definitely Not Everyone’s Cup Of Tea ☕#Toxic — ABOVE AVERAGE 👍 pic.twitter.com/kgFbdHyrYH

#ToxicTheMovie Inside Reports – BIGGEST BLOCKBUSTER 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
pic.twitter.com/Yf9N0YdX8O

టాక్సిక్ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా.. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో పెద్దలకు మాత్రమే ఈ మూవీ ప్రదర్శితం కానుంది. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్లు ఈ సినిమాను చూసేందుకు అనర్హులని అర్థం. ఇక టాక్సిక్ మూవీ రన్ టైమ్ దాదాపు 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే భాషను బట్టి ఈ మూవీ రన్ టైమ్ మారుతుంది. కన్నడలో టాక్సిక్ మూవీ 3 గంటల 30 నిమిషాలకు పైనే ఉంది. టాక్సిక్ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ తో నిర్మించారు. ఈ మూవీలో హీరో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.

ఇక టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ చూస్తే.. ఈ మూవీలో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని.. యష్ రెండు క్యారెక్టర్స్ లో తన నటనతో మైండ్ బ్లాంక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయట. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లో చేస్తాయని తెలుస్తోంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. టాక్సిక్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అని.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని మాట్లాడుకుంటున్నారు. ఇక టాక్సిక్ మూవీ ఫుల్ రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments