- తెలంగాణ లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనం
- అపోహలు నమ్మవద్దన్న కౌన్సిలర్ వెంకటేష్ జంటుపల్లి
జనవాహిని ప్రతినిధి తాండూరు; తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలు చెల్లవంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు ఎవరూ నమ్మవద్దని తాండూరు 19వ వార్డు కౌన్సిలర్ జంటుపల్లి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేఖలకు తిరుమలలో కచ్చితంగా అనుమతి ఇస్తున్నారని, భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శేషాచలం అడవుల నేపథ్యంలో మాట్లాడారు….. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇచ్చిన వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖతో తాము తిరుమలకు వచ్చామన్నారు. టీటీడీ అధికారులు ఆ లేఖను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాజుల తరహాలో అత్యంత వైభవంగా స్వామివారి దర్శనం కల్పించారని వెల్లడించారు.
ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన బుయ్యని మనోహర్ రెడ్డికి, ఈ ప్రక్రియలో సహకరించిన వారి సిబ్బంది అరవింద్ రెడ్డి, సంజీవ్, సాగర్, రాఘవు, రాజేష్ లతో పాటు తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిలర్ గా గెలుపొందితే తురుపతి దర్శనం చేసుకుంటానని కోరిన మొక్కును ఈ సందర్బంగా తీర్చుకున్నట్టు పేర్కొన్నారు. తాండూరు పట్టణ ప్రజలతో పాటు 19వ వార్డ్ ప్రజలు శుఖసంతోషలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరినట్లు ఈ సందర్బంగా తెలిపారు.
