- నగరేశ్వర ఆలయ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ
- నాటి నుంచి నేటి వరకు సేవే మార్గం..
- అందరినీ ఏకతాటిపైకి తెచ్చే వ్యక్తిత్వం..
- దేవాలయ వికాసానికి ఆయనే సరైన ఎంపిక..!
జనవాహిని ప్రతినిధి,తాండూరు:తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ నగరేశ్వర ఆలయ నూతన చైర్మన్ ఎంపిక వ్యవహారం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఆలయ పాలకమండలి బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై ప్రజాప్రతినిధులు, పెద్దలు తీవ్రంగా పునరాలోచిస్తున్నారు. అయితే, వ్యాపార దిగ్గజం, ప్రముఖ సమాజ సేవకుడు రొంపల్లి సంతోష్ పేరు ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోంది.ఏళ్లుగా తాండూరు ప్రాంతవాసులకు, ముఖ్యంగా ఆర్యవైశ్య వర్గానికి నిరంతరం అండగా నిలుస్తూ ప్రజాసేవే పరమావధిగా రొంపల్లి సంతోష్ గుర్తింపు పొందారు. లయన్స్ క్లబ్‌లోనూ, ఆర్యవైశ్య సమాజంలోనూ అనేక వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక యువతలో కూడా మంచి పట్టున నాయకుడిగా రొంపల్లి కి పేరుంది. ఎవరితోనైనా కలుపుగోలుగా ఉంటూ, సమస్యల పరిష్కారానికి ముందుండే ఆయన నైజమే ఆయనకు బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నగరేశ్వర ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సమయాన దైవకార్యాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సీనియారిటీ, అంకితభావం ఉన్న నాయకుడు అవసరమని స్థానికులు భావిస్తున్నారు. అనుభవజ్ఞుడైన రొంపల్లి సంతోష్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుందని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఆయన పేరునే చైర్మన్‌గా ఖరారు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
