HomeEntertainment'జైలర్ 2' ఓటీటీ డీల్: కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్.! 

'జైలర్ 2' ఓటీటీ డీల్: కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్.! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


‘జైలర్ 2’ ఓటీటీ డీల్: కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్.! 

Aug 13, 2026 7:24PM

సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సరికొత్త ఓటీటీ రికార్డును నెలకొల్పింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ చరిత్రలోనే ఇది ఆల్-టైమ్ రికార్డ్ ఓటీటీ డీల్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

2023లో వచ్చిన ‘జైలర్’ ఫస్ట్ పార్ట్ డిజిటల్ రైట్స్ రూ. 100 కోట్ల లోపే అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు రాబోతున్న సీక్వెల్‌కు ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్ దక్కడం విశేషం.

ఇంతకుముందు కమల్ హాసన్-మణిరత్నం కాంబో మూవీ ‘థగ్ లైఫ్’ రూ.150 కోట్లు, దళపతి విజయ్ ‘లియో’ రూ. 120 కోట్లు, పొన్నియిన్ సెల్వన్ రూ. 125 కోట్లకు ఓటీటీ డీల్స్ కుదుర్చుకున్నాయి. కానీ అవన్నీ దాటుకుని ‘జైలర్ 2’ ఏకంగా రూ. 160 కోట్లతో ఆల్-టైమ్ టాప్ స్థానంలో నిలిచింది. 

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

‘జైలర్ 1’ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లతో ఊచకోత కోసింది. మరి ఈ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోందో వేచి చూడాలి.

 

 

Jailer 2, OTT Deal, Rajinikanth, Nelson Dilipkumar

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments