- కోకట్ శివారులో అక్రమ ఇసుక రవాణా
- ట్రాక్టర్ పట్టివేత: డ్రైవర్‌పై కేసు నమోదు
జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండలం కోకట్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోకట్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను (నెంబర్: KA 32 TD 0822) గుర్తించి నిలిపివేసి, తనిఖీ చేయగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్, కోకట్ గ్రామానికి చెందిన వెంకట్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ విఠల్ రెడ్డి హెచ్చరించారు. అక్రమ రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.





