Tuesday, June 9, 2026

― Advertisement ―

అధైర్య పడకండి అండగా ఉంటాం….!

కోకట్ వాగు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శ రూ. 25 వేల తక్షణ సహాయం అందజేత.. అండగా ఉంటామని హామీ జనవాహిని ప్రతినిధి తాండూరు : కోకట్ వాగు ప్రమాదంలో...
HomeNEWSఅధైర్య పడకండి అండగా ఉంటాం....!

అధైర్య పడకండి అండగా ఉంటాం….!

spot_img
spot_img
  • కోకట్ వాగు మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శ
  • రూ. 25 వేల తక్షణ సహాయం అందజేత.. అండగా ఉంటామని హామీ

జనవాహిని ప్రతినిధి తాండూరు : కోకట్ వాగు ప్రమాదంలో గల్లంతై మృతి చెందిన మొహమ్మద్ మొయిజ్ ఉద్దీన్ కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అండగా నిలిచారు. గత నెల 30వ తేదీన జరిగిన దురదృష్టకర ఘటనలో మొహమ్మద్ రహ్మత్ అలీ, మొహమ్మద్ మొయిజ్ ఉద్దీన్, అబ్దుల్ సాదిక్ లు కోకట్ వాగులో గల్లంతై మరణించిన సంగతి తెలిసిందే.మంగళవారం పాత తాండూరులోని ఆటో డ్రైవర్ మొయిజ్ ఉద్దీన్, ఎండీ రహ్మత్ ల గృహాలను ఎమ్మెల్యే సందర్శించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని, కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం వారి కుటుంబానికి రూ. 25,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల మరణం చెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం పరంగా కూడా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.