- నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి
- శుభాకాంక్షలు తెలిపిన తాండూరు బీఆర్ఎస్ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మణికొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో తాండూరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా నరుకుల నరేందర్ గౌడ్ నాయకులతో కలిసి రోహిత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోహిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.





