- విలియం మూన్ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన
- మొదటి విడతగా రూ. 25 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- ముఖ్య అతిథిగా హాజరైన మెథడిస్ట్ సంస్థల బిషప్ సిమోన్
- ఎమ్మెల్యే చొరవపై హర్షం
జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక విలియం మూన్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగిందని జోగులా ఎబినైజెర్ తెలిపారు. తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో ఈ నిర్మాణానికి మొదటి విడత కింద రూ. 25 లక్షల నిధులు మంజూరయ్యాయి. మొత్తం ప్రహరీ గోడకు 84 లక్షలు మంజూరు అయ్యాయాని పేర్కొన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులను శంకుస్థాపన కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మెథడిస్ట్ సంస్థల బిషప్ సిమోన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని వైభవంగా విజయవంతం చేశారు.ఈ సందర్భంగా మెథడిస్ట్ జిల్లా సభ్యుడు జోగులా ఎబెనైజార్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విద్యా సంస్థల బలోపేతానికి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని, ఈ నిధుల మంజూరు ద్వారా పాఠశాలకు ఎంతో కాలంగా ఉన్న ప్రహరీ గోడ సమస్య తీరబోతుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.





