కేజ్రీవాల్ కోర్టుకు ఏం చెప్పారు?

కోర్టులో కేజ్రీవాల్ తన వాదనను స్వయంగా వినిపించారు. తనను అరెస్టు చేసిన ఈ కేసు రెండేళ్ల నాటిదని, ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని కేజ్రీవాల్ చెప్పారు. తనపై మోపినవన్నీ కూడా నిరాధార అభియోగాలు అని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దర్యాప్తు సందర్భంగా కేవలం నలుగురి స్టేట్ మెంట్స్ లో మాత్రమే నా పేరు వచ్చింది. మొదటిది మనీష్ సిసోడియా పీఏ సి.అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ . నా సమక్షంలోనే డాక్యుమెంట్ ఇచ్చారని ఆయన ఆ స్టేట్ మెంట్ లో చెప్పారు. అయితే, చాలా మంది నన్ను కలవడానికి వస్తారు. అక్కడ వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహజం. నన్ను అరెస్టు చేయడానికి ఇది తగిన కారణమా? రెండోది మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్. ఆయన తన కుటుంబ ట్రస్ట్ ఏర్పాటు కోసం నన్ను కలవడానికి వచ్చారు. వారు నా గురించి మాట మార్చడంతో ఆయన కుమారుడిని విడుదల చేశారు. మరొక స్టేట్మెంట్ శరత్ రెడ్డి ఇచ్చినది. ఆయన విజయ్ నాయర్ తో కలిసి నన్ను కలిశానని చెప్పారు. కానీ, ఈ స్కామ్ లో చేతులు మారిందని చెప్పిన డబ్బు ఎక్కడి?’’ అని కేజ్రీవాల్ తన వాదన వినిపించారు.