- ఆదివారం గురుకుల ఎంట్రన్స్ టెస్ట్
- లక్షన్నరకు పైగా అప్లికేషన్లు
- ప్రశాంతంగా పరీక్ష నిర్వహించాలి
- విధ్యార్థులకు ఆల్ ది బెస్ట్ – మంత్రి పొన్నం ప్రభాకర్
జనవాహిణి న్యూస్ డెస్క్ :- రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మొత్తం 1,67,708 అప్లికేషన్లు వచ్చాయి. 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 51,968 సీట్లు ఉండగా, ఇందులో కేవలం ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసమే 88,824 అప్లికేషన్లు, 6వ తరగతి ఎంట్రన్స్ కోసం 32,672 అప్లికేషన్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థులంతా తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలని గురుకులాలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని నాణ్యమైన విద్య తో పాటు మెస్ ఛార్జీలు పెంచిందని పేర్కొన్నారు.రేపు జరిగే గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధ్యార్థులంతా ప్రశాంతత వాతావరణం లో రాయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.