- బీసీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం…
- బీసీ సభ్య సమాజములో హర్షాతిరేకాలు
- మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్& బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు – గీకురు రవీందర్
చిగురుమామిడి మార్చి 18, 2025:- శాసన సభా సమావేశాల్లో బీసీ లకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశ పెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల తెలంగాణ బీసీ సమాజం హార్షాన్ని వెలిబుచ్చుతోంది. బీసీ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని తెలియ పరుస్తూ చిగురుమామిడి మండల కేంద్రములో కాంగ్రెస్ మండల పార్టీ, బీసీ సంఘాల నాయకులు స్వీట్లు పంపిణి చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ కామారెడ్డి తీర్మానానికి కట్టుబడి బీసీ కుల గణన చేపట్టి బీసీ లకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశ పెట్టిన బిల్లు దేశ చరిత్రలోనే చరిత్రత్మాక ఘట్టమని అన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాల్లో అభ్యున్నతి చెందుటకు ఈ బీసీ బిల్లు దోహదపడుతుందని ఆయన అన్నారు. విద్యా, ఉద్యోగాల పరంగా మరియు రాజకీయంగా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుండి నగర మేయర్ వరకు వివిధ ప్రజా ప్రదినిధుల ప్రాతినిధ్యములో 42% రిజర్వేషన్ కోసం రెండు బిల్లులు ప్రవేశ పెట్టడం కాంగ్రెస్ పార్టీ చిత్త శుద్ధికి నిదర్శనం అన్నారు. రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ మొదలు, 160కోట్ల బడ్జెట్టు కేటాయింపు, కుల గణన, డెడికేషన్ కమిటీ ఏర్పాటు, లక్ష మంది అధికారులతో 50 రోజుల పాటు కుల గణన, 70ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ అంతా శాస్త్రీయ పద్దతిలో చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమాక్ర, బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదములు తెలిపారు. అలాగే కేంద్రంలో కూడా 2/3 మెజారిటీతో ఆమోదం పొందెలా రాష్ట్ర బిజెపి నాయకులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ పొన్నం సంపత్, పూదరి వేణుగోపాల్ గౌడ్, పీచు మల్లా రెడ్డి, కోనేటి రాములు, బెజ్జంకి అంజయ్య. పొలు శ్రీనివాస్, దులుమిట్ట నరసింహారెడ్డి, పిట్టల రాజు, జీల సంపత్, పెసరి శ్రీనివాస్. సంపత్ రెడ్డి. భగవాన్ ప్రసాద్, శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.