కరీంనగర్ (జనవహిణి బ్యూరో) :- హుజురాబాద్ ఈ నెల 27 న జరుగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రె అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి తెలంగాణ జన సమితి పార్టీ మద్దతు ప్రకటించి ప్రచారం చేస్టున్నట్లు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదులు కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక ఫాసిస్టు బిజెపి కి వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికగా ఆయన అభివర్ణించారు. సమగ్ర కుల గణన ద్వారా బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు కృషిచేస్తున్న కాంగ్రెస్ కు అండగా వుండాలని, బీఆరెస్ పార్టీ నిరుద్యోగులకు గత పదేళ్లుగా న్యాయం చేయలేకనే నేడు పోటీలోంచి తప్పుకుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోరె గణేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కర్రె సతీష్ యాదవ్, యువజన సమితి నాయకులు పల్లెర్ల శ్రీనివాస్,జిల్లా నాయకులు సయ్యద్, పర్లపెల్లి శ్రీలత,అనిల్, శ్యాం,తీర్ధాల కుమార్, జంపన్న, శ్రీకాంత్, ప్రభాస్, కుమార్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.