కరీంనగర్ జనవహిణి బ్యూరో :- జమ్మికుంట ఇల్లందకుంట, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాదు, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మేజారిటితో గెలువాలని తెలంగాణ జనసమితి కరీంనగర్ జిల్లా నాయకులు ఇల్లందకుంట సీతారాముల వారిని దర్శించుకొని పూజలు చేయడం జరిగింది.అనంతరం జనసమితి నాయకులు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు ఉన్నత విద్య అందించాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి నరేందర్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి ఉన్నత లక్ష్యాలు ఉన్న వ్యక్తి శాసన మండలి లో ఉంటే నిరుద్యోగులుగా ఉన్న ఎందరో పట్టభద్రులలకు న్యాయం చేస్తాడని, రాష్ట్రం లో తన కాలేజీ ల ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వేలాది కుటుంబాలకు అండగా ఉంటున్నారని తెలిపారు.నరేందర్ రెడ్డి గెలుపు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆయన పట్టపద్రులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన సమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి,యువజన సమితి జిల్లా అధ్యక్షులు కర్రే సతీష్ యాదవ్,యువజన సమితి నాయకులు పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.