- మత రాజకీయాలు చేస్తుండా?
- భూకబ్జాలు చేస్తుండా?
- విద్య నేర్పి ఉద్యాగ అవకాశాలు కల్పించే నరేందర్ రెడ్డీకే మా మద్దతు
- వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోరే గణేష్
జనవాహిణి బ్యూరో భానుబాబు :- ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ గా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వెలుగు నీడ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మోరే గణేష్ దళిత బంధు ఆత్మ గౌరవ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరపెల్లి శివప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యతో రాష్ట్ర పేరెంట్స్ ను ఆర్థికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉంటూ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోని ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషిచేసి విద్యార్థుల భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించి శ్రమించిన నరేందర్ అన్న ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టబద్దుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులు సాధిస్తారని గణేష్ వివరించారు కరీంనగర్ జిల్లా తో పాటు చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా నరేందర్ సార్ ట్యూషన్ చెప్తేనే తాము విద్యలో రాణిస్తామని భావనతో వందలాదిగా సార్ ట్యూషన్ లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు కోసం తను పీహెచ్డీ లాంటి ఉన్నత విద్యను త్యాగం చేసి తన విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దిన త్యాగశీలి నరేందర్ అన్నని కొనియాడారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ అన్నను గెలిపించి ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుతూ శంకరపట్నo మండల కేంద్రం లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ యువజన స్వచ్చంద సేవ సంస్థల నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.