Google search engine
spot_img
spot_img
HomeJobsIIT: రోజుకు రూ.77 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీయన్..! ప్లేస్ మెంట్ ప్యాకేజీల చర్చ...

IIT: రోజుకు రూ.77 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీయన్..! ప్లేస్ మెంట్ ప్యాకేజీల చర్చ వేళ..!

spot_img
spot_img
spot_img

IIT: రోజుకు రూ.77 కోట్లు సంపాదిస్తున్న ఐఐటీయన్..! ప్లేస్ మెంట్ ప్యాకేజీల చర్చ వేళ..!

మన దేశంలో అగ్రశ్రేణ విద్యాసంస్థలుగా భావించే ఐఐటీ(IIT)లకు డిమాండ్ ఏటికేడాది పెరుగుతూనే ఉంది. అయినా వీటిలో లభించే ప్లేస్ మెంట్ల విలువ నానాటికీ తగ్గిపోతోంది. గతేడాది ఐఐటీ బోంబేలో సగటు ప్లేస్ మెంట్ ప్యాకేజీ విలువ రూ.25 లక్షలే. దీంతో ఐఐటీల్ని ఎంచుకునే విషయంలో విద్యార్ధుల తల్లితండ్రులు ఆలోచనలో పడుతున్న పరిస్ధితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐఐటీ విద్యార్ధులకు అందించే మైండ్ సెట్ ఇప్పుడు వారి కెరీర్ లను ఏ స్థాయికి తీసుకెళ్తుందో నిరూపించే ఉదాహరణ ఒకటి తాజాగా బయటపడింది.

IIT కాన్పూర్ లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సిద్దార్ధ సక్సేనా (Siddhartha Saxena) అనే విద్యార్ధి ఏఐ స్టార్టప్ స్థాపించి కేవలం 26 ఏళ్లకే మిలియనీర్ అయిపోయాడు. అంతే కాదు ఒక్క రోజులోనే రూ.77 కోట్లు సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. తద్వారా భారత్ లో ప్రస్తుతం టాప్ లేపుతున్న ఏఐ స్టార్టప్ ల జాబితాలోకి తన కంపెనీని కూడా చేర్చేశాడు. తాజాగా విరాజ్ ఆలా అనే ఓ కంటెంట్ క్రియేటర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్ధ సక్సేనా తన కెరీర్ గురించి కీలక విషయాలను పంచుకున్నాడు.

From IIT to a Rs 77-Crore Payday Meet Siddhartha Saxena Who Earned Rs 77 Crore in a Single Day

2019లో ఐఐటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సిద్ధార్ధ సక్సేనా.. ఏఐ స్టార్టప్ లోకి అడుగుపెట్టే ముందు ఎన్‌వెస్ట్‌నెట్, యోడ్లీ, వధ్వానీ ఏఐ, ఫిన్‌లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ, జూమియో కార్పొరేషన్ వంటి సంస్థలలో పనిచేస్తూ మెషిన్ లెర్నింగ్‌లో నైపుణ్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత తాను ఒక్క రోజులోనే 8 మిలియన్ డాలర్లు (రూ.77 కోట్లు) సంపాదించినట్లు వెల్లడించాడు. దీంతో మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారా అని అడిగితే అవును, దాదాపుగా అంతే అని చెప్పేశాడు. 2022లో సక్సేనా తన ఐఐటి కాన్పూర్ బ్యాచ్‌మేట్స్ ప్రత్యూష్ రాయ్ , సిర్‌సెందు సర్కార్‌లతో కలిసి జనరేటివ్ ఏఐని ఉపయోగించి ఉత్పాదకతను పెంచడానికి రూపొందించిన ఏఐ-ఆధారిత క్రోమ్ ఎక్స్‌టెన్షన్ మెర్లిన్‌ను ప్రారంభించాడు. ఈ స్టార్టప్ వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం దీని విలువ సుమారు 50 మిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments