Google search engine
spot_img
HomeTelanaganahyderabadజన్మదిన కానుకగా... 'ఆకలి తీర్చే' అల్పాహారం

జన్మదిన కానుకగా… ‘ఆకలి తీర్చే’ అల్పాహారం

spot_img
spot_img
  • ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
  • ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత టిఫిన్ పంపిణీ 
  • మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
  •  ఆగస్టు 5 వరకు నిరంతరాయంగా అల్పాహార వితరణ

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రితో పాటు హైదరాబాద్ రోడ్డులోని ఎంసిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, వారి సహాయకులు మరియు ఆసుపత్రికి వచ్చిన సదరు ప్రజలకు ఉదయం వేళ ఉచితంగా టిఫిన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ— ప్రజాసేవే పరమావధిగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ తరహా మానవతా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. ఆస్పత్రులకు వచ్చే నిరుపేద రోగులు, వారి సహాయకులు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అల్పాహార వితరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజా నాయకులు, కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments