Google search engine
spot_img
HomeJobsIBPS Clerk Recruitment 2026: 11 వేల బ్యాంకు ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి

IBPS Clerk Recruitment 2026: 11 వేల బ్యాంకు ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి

spot_img
spot_img

IBPS Clerk Recruitment 2026: 11 వేల బ్యాంకు ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి

సొంత ఊరిలో లేదా దగ్గర్లోని ప్రభుత్వ బ్యాంకులో మంచి ఉద్యోగం సాధించాలనే కోరిక ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటి బ్యాంకింగ్ ఉద్యోగ కలలు కనే అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఊహించని శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏకంగా 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

ఈ భారీ నియామక ప్రక్రియ (CRP CSA-XVI)కి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

IBPS Releases Notification for 11403 Clerk CSA Posts in 2026 Check Registration Dates and Exam Schedule

ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంతంటే..?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు విషయానికి వస్తే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ,దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు (వయోపరిమితి మినహాయింపు) వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం IBPS అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.

Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!
Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!

ఎంపిక విధానం.. పరీక్షలు ఎప్పుడంటే?

ఈ ఉద్యోగాల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. వీటితో పాటు స్థానిక భాషా సామర్థ్య పరీక్ష (LLPT) కూడా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో ప్రిలిమ్స్ పరీక్ష, డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం కూడా తగిన సమయం దొరుకుతుంది.

RRB Exam 2026: విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లు- తేదీలు, హాల్ట్ లు ఇవే..!
RRB Exam 2026: విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లు- తేదీలు, హాల్ట్ లు ఇవే..!

ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఎలా?

  • మొదట IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in ను సందర్శించాలి.
  • మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉపయోగించి మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • అనంతరం అడిగిన వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
  • ఫోటో, సంతకం ,అవసరమైన సర్టిఫికేట్లను నిర్దేశిత సైజులో అప్‌లోడ్ చేయాలి.
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించి ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.

వేలాదిగా పోస్టులు ఉన్నందున ప్రభుత్వ బ్యాంకుల్లో స్థిరపడాలనుకునే డిగ్రీ అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశమని చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments