- బషీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో కంజర్ల విజయలక్ష్మి భేటీ!
- గంటపాటు కొనసాగిన కీలక సమావేశం
- కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ సేవలపై మాజీ ఎమ్మెల్యే ప్రశంసల జల్లు
- పట్నం వీడి పల్లెలకు వచ్చి సేవ చేయడం అభినందనీయం,నారాయణరావు
- భవిష్యత్తులో పూర్తి అండగా ఉంటానని భరోసా
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణాలకే పరిమితం కాకుండా నేరుగా పల్లె బాట పట్టి, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు, మహిళలకు అండగా నిలుస్తున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ సేవా దృక్పథం ఎంతో అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కొనియాడారు. బషీరాబాద్ మండల కేంద్రంలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్… మాజీ ఎమ్మెల్యే నారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు కీలక సమావేశం కొనసాగింది.ఈ భేటీలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లెల్లో చేపడుతున్న పలు ప్రజానుకూల సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యేకు విజయలక్ష్మి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు, మహిళలకు సేవలందించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.భవిష్యత్తులోనూ ఇదే సేవా నిరతితో ముందుకెళ్లాలని, పేద ప్రజలు, మహిళల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నారాయణరావు సూచించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతున్న కంజర్ల విజయలక్ష్మికి అన్ని వేళలా తమ పూర్తి అండదండలు, సహకారం ఉంటాయని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తో కంజర్ల విజయలక్ష్మి భేటీ ప్రస్తుతం.. తాండూరు నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమం వికారాబాద్ జిల్లా మాజీ కోఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్ బాబా,జగదీష్, అమ్రేష్ ముదిరాజ్, ప్రకాష్ గౌడ్, అనిల్ గౌడ్,బుచ్చిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




