- కాబ్జా లకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు
- అక్రమణలో మున్సిపల్ జాగా..!
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు మున్సిపల్ అధికారులు తమ ఆస్తులను కాపాడుకోవడం లో తీవ్రంగా విఫలమవుతున్నారు. మున్సిపల్ స్థలాలను గాలికి వదిలేసారు. తాండూరు పట్టణంలోని 28వ వార్డ్ లో ఉన్న మున్సిపల్ స్థలం కాబ్జాలకు గురైంది. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయం ఉన్న చోట ప్రస్తుతం… పార్కింగ్ స్థాలం గా మారింది. పాత మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో ఈ స్థలం ఉంది. మున్సిపల్ స్థలం లో ప్రస్తుతం పార్కింగ్ షెడ్ ను ఏర్పాటు చేసి పూర్తిగా ఆ స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. తాండూరు లో ఎక్కడ చూసిన ప్రభుత్వ స్థలాలు కాబ్జా లకు గురవుతున్న సంబంధిత అధికారులు మాత్రం… నిద్ర మత్తు విడడం లేదు. మున్సిపల్ కు చెందిన ఖాళీ స్థలం పార్క్లు, రోడ్లు, నాలాలను కాబ్జా లు చేస్తున్న అధికారులు నుండి ఎలాంటి స్పందన లేకపోవడం కాబ్జా రాయుళ్లకు చనువుగా మారింది.




