HomeTelanaganahyderabad72.47% పూర్తయిన ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ..!

72.47% పూర్తయిన ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ..!

  • మొత్తం 1.82 లక్షల మంది ఓటర్ల ఫారాలు డిజిటైజ్
  •  23 పోలింగ్ స్టేషన్లలో 100 శాతం పూర్తి
  •  ఆగస్టు 3తో ఆఖరు గడువు కరణం పురుషోత్తం రావు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 72.47 శాతం ఎలక్టర్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయిందని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఎస్ఐఆర్ కాంగ్రెస్ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.నియోజకవర్గంలో మొత్తం 2,15,559 మంది ఓటర్లకు సంబంధించి ఫారాలతో పాటు ఏఎస్‌డీ జాబితాను  ప్రభుత్వం క్రోడీకరించ్చిందని   వెల్లడించారు. ఇప్పటివరకు అర్హత కలిగిన 1,82,804 మంది ఓటర్ల ఫారాలను డిజిటైజ్ చేశామని, మరో 36,676 ఫారాల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఏఎస్‌డీ శాతంతో కలిపి నియోజకవర్గంలో మొత్తం 85.46 శాతం ప్రక్రియ పూర్తయినట్లు స్పష్టం చేశారు.నియోజకవర్గ పరిధిలోని 23 పోలింగ్ స్టేషన్లలో డిజిటైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని ఆయన వివరించారు. యాలాల్ మండలంలో 12, తాండూరు మండలంలో 4, పెద్దేముల్ మండలంలో 5, బషీరాబాద్ మండలంలో 12 పోలింగ్ కేంద్రాల్లో లక్ష్యం పూర్తయిందన్నారు. క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న బిఎల్ఓలు, బిఎల్ఏలు, సూపర్వైజర్ల సేవలను ఆయన అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.అదేవిదంగా…..ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని కోరారు. వచ్చే ఆగస్టు 3వ తేదీతో ఎస్ఐఆర్ డిజిటైజేషన్ ముగుస్తుందని, ఆలోపు మిగిలిన ఓటర్లు ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలని సూచించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాను పక్కాగా రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments