తాండూరు, జూలై 21 (జనవాహిని): తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 23 (గురువారం) తాండూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ) సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు.
ఈ సమావేశాలకు ఎస్‌ఐఆర్ పర్యవేక్షకులుగా టీపీసీసీ నేతలు కోటిం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు హాజరుకానున్నారు. ముఖ్య అతిథులుగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ పాల్గొని పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణపై సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
- సమావేశాల షెడ్యూల్ :- ఉదయం 9:30 గంటలకు – తాండూరు పట్టణం
- ఉదయం 11:00 గంటలకు – బషీరాబాద్
- మధ్యాహ్నం 12:30 గంటలకు – యాలాల్
- మధ్యాహ్నం 2:30 గంటలకు – తాండూరు రూరల్
- సాయంత్రం 4:00 గంటలకు – పెద్దేముల్
ఈ సమావేశాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీఎల్ఏలు, క్లస్టర్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరణం పురుషోత్తం రావు విజ్ఞప్తి చేశారు.