HomeNewsబిఎల్ఎ ల సమావేశం..!

బిఎల్ఎ ల సమావేశం..!

  •  తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ బిఎల్ఎ ల సమావేశాలు
  • హాజరుకానున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్
  •  పర్యవేక్షించనున్న టీపీసీసీ నాయకులు వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల మండలాల వారీ సమీక్షా సమావేశాలు గురువారం    నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సమావేశాలకు ప్రత్యేక పర్యవేక్షకులుగా టీపీసీసీ నాయకులు కోటిం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు హాజరై బూత్ స్థాయి ఏజెంట్ల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారసింగ్ హాజరవుతారు.ఉదయం 09:30 గంటలకు, తాండూరు పట్టణం11:00 గంటలకు బషీరాబాద్,12:30 గంటలకు, యాలాల్మధ్యాహ్నం 02:30 గంటలకు, తాండూరు రూరల్, సాయంత్రం 04:00 గంటలకు, పెద్దేముల్   నియోజకవర్గంలోని ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, బిఎల్ఎ లు, క్లస్టర్ ఇంచార్జీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు సమయానికి హాజరై ఈ సమావేశాలను జయప్రదం చేయాలని పురుషోత్తం రావు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments