HomeEntertainmentఈ రెండు బొమ్మల మధ్య ఉన్న మూడు తేడాలను కనిపెట్టగలరా..?

ఈ రెండు బొమ్మల మధ్య ఉన్న మూడు తేడాలను కనిపెట్టగలరా..?


ఈ రెండు బొమ్మల మధ్య ఉన్న మూడు తేడాలను కనిపెట్టగలరా..?

ఇంటర్నెట్‌లో స్పాట్ ది డిఫరెన్స్ పజిల్స్‌కు ఉన్న ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి విజువల్ ఛాలెంజ్‌లు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. మెదడు పనితీరును చురుకుగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. పరిశీలన శక్తి, విజువల్ మెమరీ, ఏకాగ్రత, వేగంగా నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ఇలాంటి పజిల్స్ ప్రయత్నించడం మంచి మానసిక వ్యాయామంగా భావిస్తారు.

ఈ చిత్రాల్లో ఉన్న తేడాలను కనిపెట్టగలరా..?
ఈ చిత్రాల్లో ఉన్న తేడాలను కనిపెట్టగలరా..?

కాగా పిల్లలకే కాదు, పెద్దలకూ ఇవి ఆసక్తికరమైన మెదడు వ్యాయామంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన స్పాట్ ది డిఫరెన్స్ ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతోంది. ఈసారి పచ్చని పొలాలు, జంతువులు, పక్షులతో కూడిన ఓ ఫార్మ్ సీన్‌ను మీ ముందుంచారు. మొదటి చూపులో రెండు చిత్రాలు అచ్చం ఒకేలా కనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే వాటిలో మూడు చిన్న తేడాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించడానికి మీకు ఉన్న సమయం కేవలం 12 సెకన్లు మాత్రమే.

illusion-of-finding-the-three-differences-from-this-photo-for-the-test-to-eyes-also-memory-power

12 సెకన్ల ఛాలెంజ్..?

మొబైల్‌లో లేదా కంప్యూటర్ స్క్రీన్‌పై రెండు చిత్రాలను పక్కపక్కన చూసి టైమర్‌ను 12 సెకన్లకు సెట్ చేసుకోండి. ఆ తర్వాత చిత్రాన్ని ఒక్కసారిగా కాకుండా భాగాల వారీగా పరిశీలించండి. పై భాగంలోని ఆకాశం, చెట్లు, మధ్యలో ఉన్న జంతువులు, కింద భాగంలోని పూలు, మొక్కలు, నేలపై ఉన్న చిన్న వస్తువులను వరుసగా పోల్చితే తేడాలు త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది. చాలామంది పెద్ద వస్తువులపైనే దృష్టి పెడతారు. కానీ ఇలాంటి పజిల్స్‌లో అసలు ట్విస్ట్ చిన్న వివరాల్లోనే దాగి ఉంటుంది.

ఈ మూడు తేడాలనూ 12 సెకన్లలో గుర్తించగలిగితే మీ పరిశీలన శక్తి అద్భుతమని చెప్పొచ్చు. కనిపెట్టలేకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌లను తరచూ ప్రయత్నిస్తే చిన్నచిన్న వివరాలను వేగంగా గుర్తించే అలవాటు క్రమంగా పెరుగుతుంది. ఈ ఫార్మ్ చిత్రంలో మొదటి తేడా పై భాగంలో కనిపించే మేఘం ఒక చిత్రంలో మాత్రమే ఉంటుంది. రెండో తేడా.. పంది తోక రెండు చిత్రాల్లో వేర్వేరు ఆకారాల్లో కనిపిస్తుంది. అలానే మూడో తేడా దిగువ భాగంలో ఉన్న పసుపు రంగు కోడి పిల్ల పక్కన ఉన్న ఎరుపు పువ్వు ఒక చిత్రంలో కనిపించదు.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments