Home Entertainment అక్కినేని అఖిల్ ‘లెనిన్’ పబ్లిక్ టాక్.. ఒక్క ముక్కలో తేల్చేశారుగా..!

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ పబ్లిక్ టాక్.. ఒక్క ముక్కలో తేల్చేశారుగా..!

2
0


అక్కినేని అఖిల్ ‘లెనిన్’ పబ్లిక్ టాక్.. ఒక్క ముక్కలో తేల్చేశారుగా..!

Google search engine

అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదలైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అఖిల్ గత చిత్రం ఏజెంట్ ఫ్లాప్ కావడంతో దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కావడంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. దాగిన తగ్గట్లుగానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే కష్టపడింది. తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత నిర్వహించిన ఇంటర్వ్యూలు, ప్రొమోషనల్ కంటెంట్ జనాల్లోకి బాగానే రీచ్ అయింది. దాంతో విడుదలకు ముందే లెనిన్ చిత్రంపై అంచనాలు పెరిగాయి. అటు బుకింగ్స్ లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది బుక్ మై షో యాప్, డిస్ట్రిక్ట్ యాప్ లో లెనిన్ మూవీ బుకింగ్స్ పెరిగాయి.

ఇక ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో విడుదలైన లెనిన్ మూవీ ఎలా ఉంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా..? ఆడియన్స్ టాక్ ఎలా ఉంది..? అంటే లెనిన్ మూవీ ఫస్ట్ హాఫ్, అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగున్నాయని తొలి షో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఓ 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలోని సాధారణ యువకుడు ఆ గ్రామంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై ఆ ఊరి పెద్దనే ఎదిరించే పాత్రలో అఖిల్ తన సత్తా చాటారని సమాచారం.

అలాగే ఫస్టాఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్, ఎమోషనల్ సీన్స్ సినిమా హైలెట్ గా నిలిచాయని.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగుందని అభిమానులు అంటున్నారు. ఇక ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పిస్తుందట. ఇక సెకండాఫ్ లో ఊహించని ట్విస్టులు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ ఎస్ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని స్పష్టం అవుతోంది. మొత్తానికి అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ హిట్ పడబోతుందని తెలుస్తోంది.

lenin Akkineni Akhil movie review out July 10 release public talk know the review early full review

ఇక లెనిన్ మూవీలో పాజిటివ్ లు చూస్తే.. అఖిల్ నటన గత సినిమాలతో పోల్చితే అద్భుతంగా ఉందని తెలుస్తోంది. లెనిన్ పాత్రలో అఖిల్ జీవించాడనే చెప్పాలి. అలాగే మూవీలో ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. అటు క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నట్లు టాక్. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని సమాచారం. అలాగే సినిమాలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అక్కడక్కడా రైటింగ్ సరిగ్గా లేదు. స్క్రీన్ ప్లే లో లోపాలు కనిపిస్తున్నాయి. మహాభారతంలోని డైలాగ్ లు వచ్చినవే మళ్లీ మళ్లీ రావడం, విలన్ పాత్ర అంత శక్తివంతంగా లేకపోవడం అని జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే లెనిన్ మూవీ మొత్తానికి చూడదగ్గ సినిమా అని ఫుల్ టైమ్ పాస్ అని చెబుతున్నారు.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here