‘లెనిన్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుకున్నదే అయింది.!
Jul 10, 2026 9:34AM

అక్కినేని అఖిల్ హీరోగా, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ రూరల్ డ్రామా ‘లెనిన్’. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ స్క్రీన్‌పైకి వస్తుండటంతో అక్కినేని అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం నేడు (జూలై 10న) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
ట్విట్టర్ (X) వేదికగా అందుతున్న ముందస్తు రివ్యూస్ ప్రకారం, సినిమా చాలా ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్‌గా సాగిందని ప్రేక్షకులు చెబుతున్నారు. కథ ప్రారంభం నుండి ఎలాంటి ల్యాగ్ లేకుండా అసలు పాయింట్‌లోకి తీసుకువెళ్లడం, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఎలివేట్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీ భోర్సేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని.. వారి లవ్ ట్రాక్, స్నేహానికి సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ చాలా హృద్యంగా ఆవిష్కరించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ సాలిడ్‌గా డిజైన్ చేశారని, ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి.
సెకండ్ హాఫ్ లో కూడా క్రేజీ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఎమోషన్స్ కూడా బాగా పండాయని చెబుతున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని, వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని టాక్ వస్తోంది.
అఖిల్ తన గత చిత్రాల కంటే భిన్నమైన సరికొత్త ఊర మాస్ అవతారంలో కనిపించారని.. అతని ట్రాన్స్‌ఫార్మేషన్, నటన అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. ఈ సినిమాకు అసలైన ఆత్మ భాగ్యశ్రీ భోర్సే పాత్రేనని, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా రాణించిందని అంటున్నారు. మొత్తానికి, అఖిల్ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ‘లెనిన్’ ఒక సరైన చిత్రంగా నిలిచిందని ట్విట్టర్ టాక్ స్పష్టం చేస్తోంది.
Lenin X Review, Akhil Akkineni, Bhagyashri Borse, TeluguOne







