Home Business సెకండ్ హ్యాండ్‌లో అమ్మినా ఈ కారును ఎగబడి కొంటారు.. బైక్ లాగా మైలేజ్.. రూ. 6.85...

సెకండ్ హ్యాండ్‌లో అమ్మినా ఈ కారును ఎగబడి కొంటారు.. బైక్ లాగా మైలేజ్.. రూ. 6.85 లక్షల ధర

3
0

సెకండ్ హ్యాండ్‌లో అమ్మినా ఈ కారును ఎగబడి కొంటారు.. బైక్ లాగా మైలేజ్.. రూ. 6.85 లక్షల ధర

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయినటువంటి మారుతి సుజుకికి చెందిన ప్రసిద్ద కారు ఫ్రాంక్స్ (Fronx) భారత మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీలో కూడా ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన మైలేజ్, పనితీరుతో ప్రతినెలా కూడా కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది. తాజాగా ఈ కారుకి సంబంధించిన అమ్మకాల గణంకాలు కూడా చూసినట్లయితే, భారత ప్రజలు దీనిని ఎంతగా ఆదరిస్తున్నారో స్పష్టం అవుతుంది. మారుతి సుజుకి నుంచి వచ్చిన సేల్స్ నివేదిక ప్రకారం, ఫ్రాంక్స్ SUV 2026 జూన్ నెలలో 13,135 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 34 శాతం వృద్ధి.

Google search engine

మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థాయిలో ఉన్న మోడల్‌కు 34 శాతం వృద్ధి రావడం అంటే, ఈ SUVపై వినియోగదారుల నమ్మకం మరింత పెరుగుతోందని అర్థం. రోడ్డుపై ఈ కారు కనిపిస్తేనే ఒక ప్రీమియం ఫీల్ కలిగించగలిగేలా డిజైన్ చేయబడటం దీని ప్రధాన బలం. ఈ కారు మధ్యతరగతి కుటుంబానికి బాగా సరిపోద్ది. అలాగే, సెకండ్ హ్యండ్‌లో అమ్మినా కూడా కొనేవారు చాలా మంది ఉంటారు.

Maruti Suzuki Fronx June 2026 Sales 34 Percent Growth Compared To Previous

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 6.85 లక్షల నుంచి రూ. 11.98 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర మధ్య అందుబాటులో ఉంది. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్లలో అమ్మకానికి ఉన్న ఈ క్రాస్‌ఓవర్, వేరు వేరు అవసరాలు కలిగిన కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, పనితీరు, మైలేజీ, ఫీచర్ల పరంగా కూడా బెస్ట్ అందించడం దీని ప్రత్యేకత.

పనితీరు పరంగా ఫ్రాంక్స్‌లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ ఇంజన్ 99 bhp పవర్, 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో లభించే ఈ ఇంజన్ 20.1 నుంచి 21.5 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. మంచి పనితీరు, సంతృప్తికరమైన మైలేజ్ రెండింటినీ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

Maruti Suzuki Fronx June 2026 Sales 34 Percent Growth Compared To Previous

రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఇంజన్ 89 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ నగర రోడ్లపై సాఫీగా డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే ఈ వేరియంట్ 21.79 నుంచి 22.89 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో రోజూ వినియోగానికి అనువైన ఎంపికగా నిలుస్తుంది.

ఫ్యూయల్ ఖర్చులను మరింత తగ్గించుకోవాలంటే 1.2-లీటర్ CNG వేరియంట్ కూడా ఉంది. ఈ ఇంజన్ 76 bhp పవర్, 99 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఒక కిలో CNGకి 28.51 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఇది కొన్ని ప్రీమియం బైకులతో సమాన మైలేజ్. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే కుటుంబాలకు ఈ వేరియంట్ మంచి ఆప్షన్.

Maruti Suzuki Fronx June 2026 Sales 34 Percent Growth Compared To Previous

ఈ కారులో డజన్ల కొద్ది అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా భద్రత కోసం కంపెనీ దీనిలో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను అందించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు. అలాగే ABS, EBD సిస్టం, డ్రైవింగ్ సమయంలో అదనపు భద్రత కోసం ESP కూడా ఫ్రాంక్స్‌లో ఉంది. ప్రమాదాల సమయంలో కారులో కూర్చున్న వారిని ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఈ ఫీచర్లు చాలా వరకు ఉపయోగపడతాయి.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here