Home Entertainment అల్లు అర్జున్‌ సినిమాకి నో చెప్పిన “బ్లాస్ట్” బ్యూటీ..

అల్లు అర్జున్‌ సినిమాకి నో చెప్పిన “బ్లాస్ట్” బ్యూటీ..

2
0


అల్లు అర్జున్‌ సినిమాకి నో చెప్పిన “బ్లాస్ట్” బ్యూటీ..

Google search engine

ఐకాన్ స్టార్ “అల్లు అర్జున్” ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం ‘రాకా’. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.

actress-preity-mukundan-rejected-raaka-movie-offer-starring-allu-arjun-under-tamil-director-atlee

కాగా ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కాస్టింగ్ గురించి దర్శకుడు అట్లీ షేర్ చేసుకున్న ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం యంగ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్‌ను సంప్రదించినట్లు అట్లీ స్వయంగా వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అట్లీ ఏమన్నారంటే..

‘రాకా’ సినిమాలో ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కోసం మొదట ప్రీతీ ముకుందన్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించామన్నారు. అయితే అప్పటికే ఆమె పలు చిత్రాలతో బిజీగా ఉండటం, ‘రాకా’ చిత్ర నిర్మాణ షెడ్యూల్‌కు ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదని అట్లీ స్పష్టం చేశారు. ప్రీతి ముకుందన్ చేయాల్సిన ఆ పవర్‌ఫుల్ పాత్రను ఆ తర్వాత నటి ఫెమినా జార్జ్‌కి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

ఇక ఈ బ్యూటీ తెలుగులో ‘ఓం భీమ్ బుష్’, ‘కన్నప్ప’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘బ్లాస్ట్’ (బ్లాస్ట్ జోన్) చిత్రంతో మంచి హిట్ అందుకుంది. రూ.18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అర్జున్, అభిరామి లతో కలిసి నటించిన ప్రీతి.. యాక్షన్ సీక్వెన్స్‌లలో సైతం అదరగొట్టింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ సినిమా ట్రెండింగ్ గా నిలుస్తుండడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయని టాక్ వినిపిస్తుంది.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here