- తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటా..
- బిఆర్ఎస్ పార్టీకి ‘యూనుస్ సార్’ రాజీనామా!
- కష్టానికి దక్కని ఫలితం.. పదవులకు రాజీనామా చేసిన ఎండి యూనుస్.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత కొంతకాలంగా బిఆర్‌ఎస్ పార్టీలో నాయకుడిగా, మైనారిటీ గళంగా ఉన్న ఎండి యూనుస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తన పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా యూనుస్ సార్ మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించినా నాయకత్వం తన కష్టాన్ని గుర్తించలేదని విమర్శించారు. మైనారిటీ సెల్ టౌన్ ప్రెసిడెంట్‌గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, తగిన ప్రాధాన్యత లభించకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3వ వార్డ్ నుండి యూనుస్, అంజాద్ ఖాన్ లు బిఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. గురువారం అంజాద్ ఖాన్ అధికార కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దింతో బిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ యూనుస్ సార్ కే వస్తుందనే ధీమాలో ఉన్నప్పటికీ.. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఖరారు చేశారు. దింతో యూనుస్ సార్ మనస్తపం చెంది పార్టీ కి రాజీనామా చేస్తునట్టుగా ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల బరిలో కచ్చితంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయన తదుపరి అడుగు ఎటువైపు? ఏ పార్టీ గూటికి చేరబోతున్నారు? లేక స్వతంత్ర అభ్యర్థిగా సత్తా చాటుతారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.గురువారం బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల బరిలో ఉండేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. శుక్రవారం యూనుస్ సార్ నామినేషన్ వేసే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.






