ప్రభాస్ ‘ఫౌజీ’కి ఓటీటీ షాక్.. డీల్ క్యాన్సిల్ అవుతుందా?
Jul 8, 2026 2:40PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది డిసెంబరులోనే ‘ఫౌజీ’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం కేవలం అభిమానుల నిరీక్షణ మాత్రమే కాదు, దీని వెనుక ఓటీటీ ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ సినిమాలకు థియేట్రికల్ విడుదలకు ముందే వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ‘ఫౌజీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి మేకర్స్‌కు తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల డిసెంబరులో సినిమా రాకపోతే, ఓటీటీ డీల్ అమౌంట్ లో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ మార్పుల వల్ల నిర్మాతలకు భారీగా ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే ఓటీటీ సంస్థకు అలాంటి అవకాశం ఇవ్వకూడదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ పాల్గొనాల్సిన కేవలం మూడు ప్రధానమైన యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే బాకీ ఉన్నాయి. దీంతో ఓటీటీ డీల్ దెబ్బతినకుండా ఉండేందుకు, నిర్మాణ పనుల్ని మేకర్స్ వేగవంతం చేస్తున్నారు. ఒకవైపు పెండింగ్ షూటింగ్‌ను పూర్తి చేస్తూనే, మరోవైపు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా నడిపిస్తున్నారు. ఆగస్టు కల్లా ప్రభాస్ తన పార్ట్ పూర్తి చేయనుండగా, డిసెంబర్ 3న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. డెబ్యూ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Prabhas, Fauzi Movie, OTT Deal, TeluguOne







