Ravi teja: వీరాధి వీరులంట.. నిజమవుతుందా మరి!
Jul 8, 2026 10:36AM

మాస్ మహారాజా రవితేజ(Raviteja)ప్రస్తుతం ‘ఇరుముడి'(irumudi)మూవీ ఇస్తున్న కిక్ లో ఉన్నాడు. కిక్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో పోస్టర్ రిలీజ్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడి అని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం విడుదలైన సాంగ్ రిలీజ్ తో అయితే హిట్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో అని లెక్కలు వేసుకునే పరిస్థితి.
ఇక మాస్ మహారాజా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తో కలిసి మల్టి స్టారర్ గా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ ఇద్దరి కామెడీ టైమింగ్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వినూత్న కలయిక గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ‘రాజా రాజ చోర’, ‘స్వాగ్’ వంటి వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మార్క్ మాస్ ఎనర్జీని, శ్రీ విష్ణుకు ఉన్న విలక్షణమైన కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఒక క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెండు విభిన్నమైన ఆసక్తికరమైన టైటిల్స్ నెట్టింట విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు ఈ ప్రాజెక్ట్‌కు ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చెబుతుండగా, మరికొందరు ‘అక్కాయిలూ… బాగున్నారా?’ అనే వెరైటీ టైటిల్ ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు టైటిల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
Also read: rishab shetty: కాంతార ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా: చాప్టర్ 2 పై క్రేజీ అప్‌డేట్
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు మరియు మల్టీస్టారర్ సినిమాలతో ఘన విజయాలు అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో క్రేజీ కాంబో వస్తుండటంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను త్వరలోనే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

raviteja, sreevishnu, irumudi







