Home Entertainment ‘వారణాసి’ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. రాజమౌళి సడన్ సర్‌ ప్రైజ్..!

‘వారణాసి’ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. రాజమౌళి సడన్ సర్‌ ప్రైజ్..!

5
0


‘వారణాసి’ మూవీ టీజర్ అప్డేట్ వచ్చేసింది.. రాజమౌళి సడన్ సర్‌ ప్రైజ్..!

Google search engine

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధానపాత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రపంచ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని విజువల్ వండర్ ​గా ఈ మూవీ తెరకెక్కుతోంది. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తోనే అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అటు బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయాల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటి వరకూ వారణాసి మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్, సంచారి సాంగ్, రణకుంభ థీమ్ సాంగ్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక గతంలో ఓ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ శ్రీరాముడి లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను పెట్టుకున్నానని తెలిపారు. ఇక ఇటీవల మహేశ్ బాబు శ్రీ రాముడి లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ చిత్ర యూనిట్ దీనిపై అధికారికంగా ధ్రువీకరించలేదు.

అయితే వారణాసి మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ లేదా పోస్టర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమురం భీమ్ పోస్టర్ ను.. అలాగే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే ప్రకారం మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా శ్రీరాముడు పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న థియేటర్లలో విడుదల కానుంది.

MaheshBabu Birthday Special First Poster of SS Rajamouli s Varanasi to Release Varanasi movie

ఇక వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్​ పాత్రలో కుంభ పాత్రలో నటిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్​ పై కేఎల్​ నారాయణ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here