Home Business మారుతి సుజుకి అదిరిపోయే బంపర్ ఆఫర్.. టాప్ సెల్లింగ్ SUV ధరను భారీగా తగ్గించిన కంపెనీ

మారుతి సుజుకి అదిరిపోయే బంపర్ ఆఫర్.. టాప్ సెల్లింగ్ SUV ధరను భారీగా తగ్గించిన కంపెనీ

4
0

మారుతి సుజుకి అదిరిపోయే బంపర్ ఆఫర్.. టాప్ సెల్లింగ్ SUV ధరను భారీగా తగ్గించిన కంపెనీ

భారతదేశంలో అత్యధికంగా కార్లను విక్రయించే దిగ్గజ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న తన బెస్ట్ సెల్లింగ్ మిడ్ సైజ్ SUV మారుతి సుజుకి విక్టోరిస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ SUV ధర మీద ఏకంగా రూ.38,900 వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Google search engine

సాధారణంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కార్ల ధరలను కంపెనీలు పెంచుతాయే తప్ప తగ్గించవు. కానీ మారుతి మాత్రం ఇందుకు భిన్నంగా ధర తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గడిచిన జూన్ (2026) నెల అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో తర్వాత దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన రెండో మిడ్-సైజ్ SUVగా విక్టోరిస్ రికార్డు సృష్టించింది. కేవలం ఒకే నెలలోనే 10,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు.

Maruti Suzuki Slashes Victoris SUV Price By Rs 38 900 Check New Variants 28 Kmpl Mileage Details

మారుతి విక్టోరిస్ కొత్త ధరల జాబితా ఇదే
ధరల తగ్గింపు నిర్ణయం ఈ ఎస్‌యూవీలోని అన్ని మోడళ్లకు వర్తించదు. కేవలం నాలుగు నిర్ధిష్ట వేరియంట్లలో మాత్రమే మారుతి సుజుకి ఈ రూ.38,900 తగ్గింపును అందజేస్తోంది. ఈ ధర తగ్గింపు తర్వాత మారిన కొత్త ధరల వివరాలను చూస్తే.. మ్యాన్యువల్ ఆప్షన్ లో ఉన్న ZXi (O) MT వేరియంట్ ప్రైస్ రూ.14.08 లక్షల నుంచి రూ.13.69 లక్షలకు తగ్గింది.

అలాగే టాప్ ఎండ్ మ్యాన్యువల్ మోడల్ ZXi Plus (O) MT ధర రూ.15.82 లక్షల నుంచి ప్రస్తుతం రూ.15.43 లక్షలకు చేరింది. ఆటోమేటిక్ వేరియంట్ల విషయానికి వస్తే.. ZXi (O) AT మోడల్ ఇకపై రూ.15.64 లక్షలకు బదులుగా రూ.15.25 లక్షలకే లభించనుంది. ఇక అన్నింటికంటే టాప్ వేరియంట్ అయిన ZXi Plus (O) AT ధర రూ.17.77 లక్షల నుంచి రూ.17.38 లక్షలకు తగ్గింది.

Maruti Suzuki Slashes Victoris SUV Price By Rs 38 900 Check New Variants 28 Kmpl Mileage Details

ఆశ్చర్యపరిచే లుక్.. అదిరిపోయే ఫీచర్లు
మారుతి సుజుకి విక్టోరిస్ డిజైన్ పరంగా రోడ్డు మీద వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్లో సరికొత్త జనరేషన్ బోల్డ్ క్రోమ్ గ్రిల్‎తో పాటు స్లీక్ ఎల్ఈడీ (LED) హెడ్‌లైట్లను అందించారు. కారుకు ఉన్న మస్కులర్ బంపర్, స్టైలిష్ అలాయ్ వీల్స్ దీనికి పక్కా ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తాయి.

లోపలి భాగానికి వస్తే కేబిన్ చాలా విశాలంగా, వెలుతురుతో అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో పాటు 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో హైలైట్‌గా నిలుస్తుంది. ప్రయాణికుల కంఫర్ట్ కోసం పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Maruti Suzuki Slashes Victoris SUV Price By Rs 38 900 Check New Variants 28 Kmpl Mileage Details

లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజ్
ఇంజిన్, పవర్‌ట్రెయిన్ పరంగా చూసుకుంటే కస్టమర్ల కోసం మారుతి ఇందులో పలు ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. ఈ SUVలో 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ మరియు 1.5-లీటర్ సీఎన్‌జీ (CNG) ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ విషయంలో ఈ కారు తన సెగ్మెంట్ లోనే టాప్ ప్లేస్ లో ఉంది.

దీని నార్మల్ పెట్రోల్ మోడల్ లీటరుకు 21.18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో దీని సీఎన్‌జీ వేరియంట్ 27 కిలోమీటర్ల వరకు, అలాగే అడ్వాన్స్డ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ అయితే లీటరుకు ఏకంగా 28.65 కిలోమీటర్ల బంపర్ మైలేజీని అందిస్తూ కస్టమర్ల జేబుకు భారం తగ్గించనుంది.

భారత్ NCAP టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్
కేవలం మైలేజ్, లుక్స్ మాత్రమే కాదు.. సేఫ్టీ విషయంలోనూ మారుతి ఈ కారును ఎంతో బలంగా తయారు చేసింది. Bharat NCAP నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో మారుతి విక్టోరిస్ SUV అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5 స్టార్ సేఫ్టీ రేటింగును సొంతం చేసుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ కంపెనీ ఈ కారులోని అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్స్ ను స్టాండర్డుగా అందిస్తోంది.

వీటితో పాటు సేఫ్ డ్రైవింగ్ కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.. దీని టాప్ మోడల్స్ లో అడ్వాన్స్డ్ లెవెల్-2 అడాస్ (ADAS) టెక్నాలజీతో పాటు 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా లాంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు కూడా జోడించారు.

రూ.10.50 లక్షల నుంచే ప్రారంభం
మారుతి సుజుకి విక్టోరిస్ కార్లను మిడ్-సైజ్ సెగ్మెంట్‌లో చాలా రీజనబుల్ ధరకే తీసుకొచ్చారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.50 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం మీ నగరం, స్థానిక పన్నుల (ఆర్టీఓ ఛార్జీల) ఆధారంగా మారుతుంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే స్టైలిష్ లుక్, ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్, మోడ్రన్ ఫీచర్లు, దేశంలోనే బెస్ట్ మైలేజ్ కావాలనుకునే కుటుంబాలకు ఈ మారుతి విక్టోరిస్ ఒక పక్కా పైసా వసూల్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here