Home Entertainment అక్కినేని అఖిల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? నాగార్జున కాదట..!

అక్కినేని అఖిల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? నాగార్జున కాదట..!

3
0


అక్కినేని అఖిల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? నాగార్జున కాదట..!

Google search engine

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం హిట్టు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 1995 లో ఏడాదిన్నర వయసులోనే అఖిల్ కెమెరా ముందుకు వచ్చారు. సిసింద్రీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆ తర్వాత పెద్దయ్యాక 2014 లో మనం చిత్రంలో మెరిశారు. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య నటించారు. ఈ మూవీ క్లైమాక్స్ లో అఖిల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.

అలా వరుసగా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాలతో మెప్పించారు. హిట్టుతో సంబంధం లేకుండా ఈ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అఖిల్ నటించిన లెనిన్ మూవీ విడుదలకు సిద్ధం అయింది. జూలై 10 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అక్కినేని అఖిల్ తన మనసులోని మాటను వెల్లడించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫేవరెట్ హీరో అని తెలిపారు. పోకిరి సినిమా ఎన్నిసార్లు చూశానో తెలియదని స్పష్టం చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన క్రష్ అని పేర్కొన్నారు.

Akhil Akkineni Reveals Favorite Actor and It s Surprisingly Not Nagarjuna Akhil favorite actor

ఇక ఆయన కీలక పాత్రలో నటించిన లెనిన్ మూవీ రిలీజ్ కు సిద్ధం అయింది. ఈ మూవీని మురళీ కిషోర్ అబ్బూరు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ట్విస్టులు బాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అద్భుతంగా, ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీ తర్వాత అక్కినేని అఖిల్.. అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here