భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జనవాహిణి ప్రతినిధి
మణుగూరు:- మణుగూరు లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ డి జి పి సి వి ఆనంద్ వేద మంత్రాల నడుమ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ
ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందేలా పని చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలను పరిరక్షించాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. గంజాయి రవాణా, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి మాదకద్రవ్యాలపై కఠినంగా పోరాడాలని, యువత డ్రగ్స్ బారిన పడకుండా అవగాహనతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నక్సలిజం, మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని, ఇకపై మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాగే గంజాయి సాగు చేసే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు..







