HomeNewsపైలెట్ బర్త్డే జోష్....!

పైలెట్ బర్త్డే జోష్….!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఘనంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • మణికొండ నివాసంలో కేక్ కట్ చేసిన రోహిత్ రెడ్డి.. తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
  •  తాండూరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, క్యాంప్ ఆఫీస్‌లో సంబరాలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని మణికొండ ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రమోదిని, సతీమణి ఆర్తి రెడ్డి, రితేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మరిన్ని ఆయురారోగ్యాలతో నిరంతరం ప్రజాసేవలో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పైలట్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments