Home News సమ్మెకు మద్దతు తెలిపిన జావీద్…!

సమ్మెకు మద్దతు తెలిపిన జావీద్…!

170
0
  • విఏఓ ల సమస్యలను పరిష్కరించండి
  • ప్రభుత్వానికి కౌన్సిలర్ హెచ్చరిక
  • విఏఓ లకు మద్దతు తెలిపిన జావీద్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమ్మెకు మద్దతుగా తాండూర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ మద్దతు తెలిపారు. స్థానిక విఏఓ ల నిరసన శిబిరాన్ని సందర్శించి ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిలో గ్రామాల్లో విఏఓ లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, కానీ ప్రభుత్వం వారిని విస్మరించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వారు చేస్తున్న పోరాటం న్యాయమైనదని స్పష్టం చేశారు. విఏఓ ల నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, విఓఏ ల సమస్యలపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విఓ ఏ లకు నెలకు రూ. 20,000 చొప్పున వేతనం చెల్లించాలని, ఆచరణాత్మకంగా లేని జీవో 58 నిబంధనలను సవరించి, వారికి న్యాయం చేయాలన్నారు.  ఆరోగ్య భీమాతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విఏఓ ల డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే, సీఎం కార్యాలయాలను ముట్టడించేందుకు కూడా వెనుకాడము అని జావీద్ హెచ్చరించారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here