అక్కినేని అఖిల్ “లెనిన్” కోసం డ్రాగన్..
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘లెనిన్’పై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుని సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. జూలై 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు “అఖిల్”. కాగా అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే కేవలం గెస్ట్ గా రావడమే కాకుండా అఖిల్ అక్కినేనిని ఎన్టీఆర్ స్వయంగా ఇంటర్వ్యూ చేసేలా ఒక స్పెషల్ టాక్ షోని డిజైన్ చేస్తున్నారట మేకర్స్. గతంలో 2019 జనవరిలో రిలీజ్ అయిన మిస్టర్ మజ్ను సినిమా ప్రిరీలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ లెనిన్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతుండటంతో రెండు ఫ్యామిలీల అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
మరోవైపు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక రీసెంట్ గానే ఘనంగా జరిగింది. జూన్ 6వ తేదీన హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.








