HomeNewsఎంసిహెచ్ కాదు యామరాజు ఆసుపత్రి ..! 

ఎంసిహెచ్ కాదు యామరాజు ఆసుపత్రి ..! 

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  •  వైద్యానికి వచ్చిన రోగులు భయపడుతున్నారు
  •  కనీస సౌకర్యాలు లేకుండానే కొనసాగుతున్న ఆసుపత్రి 
  • ఎంసిహెచ్ ఆసుపత్రిని గాలికి వదిలేసినా అధికారులు, ఎమ్మెల్యే 
  •  తాండూర్ లో అఘాయిత్యాలు జరుగుతున్న ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించడ…? 
  • 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆగ్రహం…! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : మాతా శిశు ఆసుపత్రిని యమరాజు ఆసుపత్రికి మార్చారని స్థానిక వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి గల మాతా శిశు ఆసుపత్రికి రావాలంటే రోగులు భయపడుతున్నారు అన్నారు. కనీస సౌకర్యాలు లేని ఈ ఆసుపత్రిలో రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ప్రతి చిన్న సమస్యకు హైదరాబాద్ రిఫర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యులు తమ జీతాలకు తప్ప.. సామాన్య ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ నెలలోనే దాదాపుగా ఏడు మంది రోగులను నిర్లక్ష్యం చేసి వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడారు అని పేర్కొన్నారు. మధ్యలో నిర్లక్ష్యం వల్ల బాలింత స్త్రీ కడుపులో పత్తి వదిలేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో మాతా శిశు ఆసుపత్రిలో దాదాపు ఒక నెలలోపల 300 కు పైచిలుకు కాన్పులు అవుతుండేవని, రాష్ట్రంలోనే రెండో స్థాయిలో ఉండే మాతా శిశు ఆసుపత్రి ప్రస్తుతం కాన్పులు చేసేందుకే భయపడుతున్నారు అంటూ విమర్శించారు. జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన మాతా శిశు ఆసుపత్రి కి ఎక్కడినుండో రోగులు వైద్యం కోసం వస్తుంటారు, కానీ ప్రస్తుతం మీ ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఆసుపత్రిని సందర్శించిన కౌన్సిలర్ జావిద్ మూత్రశాలలు, పలు వార్డులలోని రోగులను, ఆసుపత్రి టెర్రస్పై ఉన్న వాటిని చూసి కంగుతిన్నామన్నారు. ఆసుపత్రిని పట్టించుకోకుండా, గాలికి వదిలేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రి పై ప్రత్యేక చరవ చూపి మరలా పూర్వ వైభవం తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా గత రెండు రోజుల నుంచి నేర్చుకో వర్గంలో మైనర్ బాలికలపై జరిగిన అఘాయిత్యాలపైన స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తాండూర్ లో ఇన్ని అఘైత్యాలు జరుగుతున్న ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడకపోవడం గమనార్థమన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments