HomeNewsమైనర్ బాలికపై యువకుడి అఘాయిత్యం

మైనర్ బాలికపై యువకుడి అఘాయిత్యం

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • చార్జర్, నీళ్ల సాకుతో ఇంట్లోకి వెళ్లి దారుణం
  • నిందితుడిపై రేప్, పోక్సో కేసు నమోదు
  • వివరాలు వెల్లడించిన ఎస్ఐ విట్టల్ రెడ్డి

జనవాహిణి ప్రతినిధి తాండూరు : యాలల మండల పరిధిలోని ఓ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 14 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పోలీసులు కథనం ప్రకారం….గ్రామానికి చెందిన షేక్ ఫరన్ (18) తండ్రి బషీర్, తన ఇంటి పక్కనే నివసించే మైనర్ బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు.. ఫోన్ చార్జర్ కావాలని, తాగడానికి నీళ్లు కావాలనే సాకుతో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం బాలికపై బలవంతంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్ కేసుతో పాటు కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విట్టల్ రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళలు, మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments