HomeNewsఎమ్మెల్యే పై విమర్శలు చేస్తే సహించం..! 

ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తే సహించం..! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  •  సొంత ఊరిలో ఓడిన శ్రీశైల్ రెడ్డికి విమర్శించే హక్కు లేదు
  •  అక్రమ కేసులు, రౌడీయిజం బీఆర్ఎస్ డీఎన్ఏలోనే ఉంది
  •  మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షుల ఫైర్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై నమోదైన కేసు విషయం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. శనివారం తాండూరులో పట్టణ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. గత మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర హంగామా సృష్టించింది బిఆర్ఎస్ పార్టీ నాయకులే అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లలేదని, మీడియా పాయింట్ దగ్గరే ఉన్నారాన్నారు. కౌంటింగ్ కేంద్రం బైట మాజీ ఎమ్మెల్యే మత్తులో ఉండి పోలీస్ అధికారులపై చెయ్యి చేసుకున్న సంగతి తాండూరు ప్రజలందరూ చూసారని తెలిపారు. గత పదేళ్ల కాలంలో అక్రమ కేసులు పెట్టి, ప్రత్యర్థులను వేధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. రౌడీయిజం చేసిన ఘనత మీకే దక్కుతుంది అని వారు ఘాటుగా విమర్శించారు. మచ్చలేని నాయకుడిగా పేరున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాండూరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా శ్రీశైల్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.సొంత గ్రామంలోనే ప్రజల నమ్మకాన్ని గెలవలేక ఓడిపోయిన వ్యక్తి, నేడు అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఓటమి భయం, రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి దిగజారుడు విమర్శలకు దిగుతున్నారని వారు విమర్శించారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సారథ్యంలో తాండూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఓర్వలేకనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అవాస్తవాలు మాట్లాడటం మానుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు,  మున్సిపల్   కౌన్సిలర్ లు   పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments